గ్రేటర్ లో నాలాల ఫిర్యాదులకు వాట్సప్ నెంబర్

V6 Velugu Posted on Jun 13, 2021

హైదరాబాద్: జీహెచ్ఎంసి పరిధిలోని నాలాలలో పూడిక తొలగింపు పనుల కోసం ప్రభుత్వం రూ.45 కోట్లు కేటాయించిందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పూడిక తొలగింపు పనుల పురోగతిపై  ఈ నెల11 వ తేదీన అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో నాలాలను సందర్శించాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా ఈ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారని చెప్పారు. 
జంటనగరాలలోని నాలాలలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా 9848021665 నెంబర్ తో వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కొత్త ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు, జంక్షన్ ల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాలాలలో పూడిక తొలగింపు పనులపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈ నెల 14 నుండి 19 వ తేదీ వరకు ఎంఎల్ఏ లు, ఎంఎల్సీ లు, కార్పొరేటర్ లు సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో  నాలాలను సందర్శించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించినట్లు వివరించారు. 14వ తేదీ సోమవారం ఉదయం10 గంటలకు తాను అధికారులతో కలిసి బేగంపేట నాలాను సందర్శించనున్నట్లు ప్రకటించారు. నాలాల పూడిక తొలగింపు కు సంబంధించిన ఫిర్యాదులను ఫోటోలు, నాలా ప్రాంతం పేరు, సంబంధిత వ్యక్తి సమాచారం వాట్సప్ గ్రూప్ కు పంపించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు. డైరెక్ట్ గా పిర్యాదు చేయదలచిన వారు నెంబర్ 9848282309 కు చేయాలని మంత్రి సూచించారు.

Tagged WhatsApp, complaints, Minister Talasani Srinivas Yadav, number, greater Hyderabad,

Latest Videos

Subscribe Now

More News