కట్ చేసిన జీతాలు ఎప్పుడిచ్చేది నెలాఖరులో చెప్తం

కట్ చేసిన జీతాలు ఎప్పుడిచ్చేది నెలాఖరులో చెప్తం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో కట్ చేసిన  ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఎప్పుడు? ఎలా చెల్లిస్తామో ఈ నెలాఖరులోగా ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు ఖర్చుచేసిందని, ఇంకెంతయినా ఖర్చు చేస్తామని చెప్పారు. మండలిలో  మంగళవారం తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్లు 2020ను ఆయన ప్రవేశపెట్టా రు. ఈ బిల్లుతో పాటు సభలో ప్రవేశపెట్టిన మరో 4 బిల్లులూ ఆమోదం పొందాయి. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.10,090 కోట్లను కేంద్రం ఇవ్వట్లేదని తెలిపారు. దేశంలో అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిదని, తెలంగాణ  రెండోదని చెప్పారు. దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా జమ్ముకాశ్మీర్ నిలిచిందన్నారు. ఆయుష్ కాలేజీల్లో బోధనా సిబ్బంది రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ వయసును 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును సభ ఏకగ్రీవంగా
ఆమోదించింది.

85 శాతం స్టూడెంట్ల ఇండ్లలో  టీవీలున్నయ్‌‌‌‌‌‌‌‌: మంత్రి స‌‌‌‌‌‌‌‌బిత

స్కూళ్లు ఎప్పుడు తెరుస్తామో స్పష్టత రాలేదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ర్టంలోని 85 శాతం మంది స్టూడెంట్ల ఇండ్లల్లో టీవీలు, 40 శాతం మంది ఇండ్లల్లో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు ఉన్నాయని తాము చేసిన స‌‌‌‌‌‌‌‌ర్వేలో తేలింద‌‌‌‌‌‌‌‌న్నారు. లేని వాళ్లను పక్కవారితో అడ్జెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశామని వివరించారు. 48 వేల వాట్సాప్ గ్రూప్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ టీచింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామన్నారు.

శ్రీశైలం ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ప్రమాదం విచారణ పూర్తవలే: మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి

శ్రీశైలం పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ప్రమాదంపై సీఐడీ విచారణ జరుగుతోందని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. బీజేపీ సభ్యుడు రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. జెన్‌‌‌‌‌‌‌‌కో వేసిన ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీలో ముగ్గురికి కొవిడ్‌‌‌‌‌‌‌‌ రావడంతో 15రోజుల్లో నివేదిక రాలేదన్నారు. ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ప్రమాదం ప్రపంచంలోనే తొలిసారని చెప్పారు. ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను కాపాడే ప్రయత్నంలో 9 మంది సిబ్బంది మరణించారన్నారు.

ఇప్పటికే సర్పంచ్‌‌‌‌‌‌‌‌, ఎంపీటీసీలకు జీతం పెంచాం: మంత్రి ఎర్రబెల్లి

సర్పంచ్‌‌‌‌‌‌‌‌, ఎంపీటీసీ, జెడ్‌‌‌‌‌‌‌‌పీటీసీలకు ఆరోగ్య భద్రత కల్పించే ప్రతిపాదన లేదని పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు స్పష్టం చేశారు. వాళ్లకు అధికారాల విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌, ఎంపీటీసీ, జెడ్‌‌‌‌‌‌‌‌పీసీటీలకు ఇప్పటికే ప్రభుత్వం జీతాలు పెంచిందని తెలిపారు.

యాసంగి రైతుబంధు త్వరలోనే ఇవ్వడానికి ట్రై చేస్తం: మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

-పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా పంట రుణాల మంజూరుకు ఉత్తర్వులు ఇస్తామని వ్యవసాయ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. వడ్డీ రాయితీకి సంబంధించి 2015–16 లో 54.98 కోట్లు, 2016–17లో 153.72కోట్లు, 2018–19లో 508.34 కోట్ల చొప్పున రూ. 717.04 కోట్లు బకాయిలు ఉన్నట్లు చెప్పారు. కానీ 2019–20 బకాయిలను మాత్రం  దాటవేశారు. రుణమాఫీకి రూ. 25 వేల లోపు రుణాలను తొలి విడతగా మాఫీ చేసినట్లు మంత్రి చెప్పారు. రైతుబంధు వానాకాలానికి రూ.7,273 కోట్లు రైతుబంధు ఇచ్చామన్నారు. త్వరలో యాసంగికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.