అమెరికా వెళ్తే ఆ నటితో పోల్చారు

అమెరికా వెళ్తే ఆ నటితో పోల్చారు

సీతగా సౌత్​ ఆడియెన్స్​ మనసు దోచిన మృణాల్​ ఠాకూర్(Mrunal Thakur)​ ఇటీవల చేసిన ఫొటో షూట్స్​ వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. బికినీ ఫొటోలను తన సోషల్​ మీడియాలో  పోస్ట్​ చేయడంతో కొందరు ట్రోల్​ కూడా చేశారు. బాడీ ఫిట్​గా లేకపోయినా ఈ ఎక్స్​పోజింగ్​ అవసరమా అంటూ ఈ ఫొటోలకు కామెంట్స్​ చేశారు. 

తాజాగా మృణాల్​ తనపై జరిగిన బాడీ షేమింగ్​పై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కెరీర్​ మొదలు పెట్టినప్పటి నుంచీ నా బాడీ గురించి రకరకాలుగా మాట్లాడేవారు. కొంచెం బొద్దుగా ఉండటంతో ఫ్యామిలీ ప్యాక్​లా ఉన్నావనేవారు. దీంతో సోషల్​ మీడియాకు కొంతకాలం దూరంగా ఉన్నాను. కానీ, ఓసారి అమెరికా వెళ్లినప్పుడు నన్ను హాలీవుడ్​ తార కిమ్​ కర్దాషియాన్(Kim Kardashian) ​తో పోల్చారు. అది  నాలో కాన్ఫిడెన్స్​ను పెంచింది. 

ఇప్పుడెవరెన్ని ట్రోల్స్ చేసినా పట్టించుకోవడం లేదు’ అంటూ మృణాల్​ వివరించింది.