
తన తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు డాక్టర్ సరైన సలహా ఇచ్చుంటే తాను వెన్నెముక లోపంతో పుట్టి ఉండేదాన్ని కాదని బ్రిటన్కు చెందిన ఓ యువతి కోర్టుకెళ్లింది. వెన్నెముక లోపంతో బాధపడుతున్న 20 ఏండ్ల ఇవీ టూంబ్స్ తన ఫ్యామిలీ డాక్టర్ ను కోర్టుకు లాగింది. తన తల్లి ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవాలని డాక్టర్సూచిస్తే.. తనకు వెన్నెముక లోపం వచ్చే ప్రమాదం ఉండేది కాదని ఆమె వాదించింది. ఆమె కేసును సమర్థించిన లండన్ హైకోర్టు జడ్జి బాధితురాలికి రూ. లక్షల్లో పరిహారం పొందే హక్కు ఉందని తీర్పునిచ్చారు. అయితే, ఆమెకు ఎంత పరిహారం దక్కిందన్నది వెల్లడికాలేదు.