జీడిమెట్ల : వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తో ఓ యువకుడు చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్‌చారి(28) బస్సు బాడీ లేబర్ పనిచేస్తుంటాడు. శుక్రవారం రాత్రి వినాయక మండపం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. మండపం పై నుంచి వర్షం నీరు కిందికి రాకుండా టార్పాలిన్‌తో కడుతున్నాడు.
ఇనుప బైండింగ్ వైర్ ని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో మండపం పైకి విసిరాడు. బైండింగ్ వైర్ విద్యుత్ తీగలకు తగలడంతో నవీన్‌చారి షాక్‌తో పడిపోయాడు. అక్కడే ఉన్న వడ్ల శంకర్ చారి (40) కర్ర సాయంతో నవీన్ చారిని పక్కకు జరిపే ప్రయత్నం చేయగా అతనికి కూడా షాక్ తగిలింది. నవీన్ చారి మృతి చెందగా, శంకర్ చారి చికిత్స పొందుతున్నాడు.