పరిగి, వెలుగు: మెటల్ డిటెక్టర్‌తో గుప్త నిధులను గుర్తించేందుకు ప్రయత్నిస్తుండగా, ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సయ్యద్ పల్లిలో శనివారం ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన కొత్తపల్లి అనిత తన పాత ఇంట్లో గుప్త నిధులను గుర్తించేందుకు మరో వ్యక్తి అక్బర్సూచనతో ఆన్లైన్లో మెటల్ డిటెక్టర్నుఆర్డర్ చేసింది. ఆ మిషన్‌తో సహాయంతో ఇంట్లో అన్వేషిస్తుండగా, వింత శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పరిగి పోలీసులు అనితతోపాటు కుటుంబసభ్యుడు జంగయ్య, అక్బర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.