
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలకు జవాబివ్వాలని విప్ ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. లేకపోతే నోరు మూసుకొని గెస్ట్ హౌస్ లో పడుకోవాలంటూ ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘ఢిల్లీలో నీ చీకటి పనులను నీ చెల్లి ఎప్పుడో బయటపెట్టింది. అప్పుడు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు సీఎం రమేశ్ చేసిన ఆరోపణలకూ నీవు నోరు విప్పడం లేదు” అని విమర్శించారు. ‘‘బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం కోసం ఢిల్లీలో సీఎం రమేశ్ ఇంటికి వెళ్లావా? లేదా? సీబీఐ, ఈడీ విచారణ ఆపాలని రమేశ్ ను బతిమాలావా? లేదా?” అని ప్రశ్నించారు.