V6 News

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర : విప్ ఆది శ్రీనివాస్

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర :   విప్ ఆది శ్రీనివాస్
  •    విప్ ఆది శ్రీనివాస్ 

చందుర్తి/ కోనరావుపేట, వెలుగు: రైతులు తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ నగేశ్‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 గా నిర్ణయించిందని, రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మాలని సూచించారు.  

అంతకుముందు కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, గొల్లపల్లి, మరిమడ్ల గ్రామాల సర్పంచులు కమ్మరి స్వప్న, మాడుగుల ఆమని, కోల స్వాతి... పలువురు వార్డు సభ్యులతో కలిసి ఆదివారం కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ చేరుతున్నారన్నారు.