ఎవరీ కాజల్.. రూ.80 కోట్ల ఆస్తిని సీజ్ చేసిన పోలీసులు

ఎవరీ కాజల్.. రూ.80 కోట్ల ఆస్తిని సీజ్ చేసిన పోలీసులు

గ్యాంగ్‌స్టర్ రవికనా అలియాస్ రవి నగర్‌ కు చెందిన ప్రాంతాల్లో సోదాలు జరిపిన గ్రేటర్ నోయిడా పోలీసులు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. విచారణకు సంబంధించి కాజల్ ఝా అనే మహిళకు చెందిన రూ.80 కోట్ల ఆస్తిని కూడా పోలీసులు సీల్ చేశారు.

కాజల్ ఝా ఎవరు?

ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉంటున్న కాజల్ ఝా.. గ్యాంగ్‌స్టర్ రవికనా స్నేహితురాలుగా పోలీసులు గుర్తించారు. ఆమె ఉంటున్న ఇంటి విలువ రూ. 80 కోట్లు కాగా, ఈ ఇంటిని రవి ఆమెకు బహుమతిగా ఇచ్చాడని చర్చ జరుగుతోంది.

బార్ అండ్ స్క్రాప్ మాఫియా రవినగర్ (రవికాన) ముఠాకు చెందిన సుమారు రూ.100 కోట్ల ఆస్తులను సీల్ చేసిన పోలీసులు.. ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. కాజల్ ఝా, ఉద్యోగం కోసం రవితో పరిచయం ఏర్పడింది. చివరకు అతని గ్యాంగ్‌లో చేరింది. ముఠా వ్యాపారాన్ని నిర్వహించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. రవికనాతో సంబంధం ఉన్న మాఫియా గ్యాంగ్‌లోనే కాజల్ ఝా కూడా పనిచేసింది.

ముఠాలోని మరో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల ఆచూకీని కనుగొనడంతో, పోలీసులు సీజ్ ప్రారంభించారు. ఇది కాకుండా, ఢిల్లీ, ఘజియాబాద్, డెహ్రాడూన్, పంజాబ్, బులంద్‌షహర్‌లలో ఉన్న ముఠాకు చెందిన అనేక రహస్య స్థావరాలు, ఆస్తులు, గోదాములను పోలీసులు కనుగొన్నారు. పలు నగరాల్లో పోలీసు బృందాలు చేశాయి. త్వరలోనే ఈ స్థలాలపై చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.