ఎవరీ లిజార్డ్ విలియమ్స్.. ఈ ఫాస్ట్ బౌలర్ కు భయపడుతున్నారా..?

ఎవరీ లిజార్డ్ విలియమ్స్.. ఈ ఫాస్ట్ బౌలర్ కు భయపడుతున్నారా..?

భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కి దక్షిణాఫ్రికా పేసర్లు  అన్రిచ్ నార్ట్జే,సిసంద మగాలా గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. వీరి స్థానాల్లో ఫహుల్క్ వాయో, లిజార్డ్ విలియమ్స్ వచ్చి చేరారు. ఫహుల్క్ వాయో ఆల్ రౌండర్ గా చాలా కాలం దక్షిణాఫ్రికా జట్టులో కొనసాగాడు. ఇక లిజార్డ్ విలియమ్స్ దక్షిణాఫ్రికా జట్టులో అడపాదడపగా వచ్చి పోతు ఉన్నాడు. ప్రస్తుతం ఈ యువ పేసర్ తన బౌలింగ్ తో దడ పుట్టించడానికి రెడీగా ఉన్నాడు. ఇంతకీ ఈ లిజార్డ్ విలియమ్స్ ఎవరో చూద్దాం 
  
29 ఏళ్ల వయస్సులో, లిజాద్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. వ్రేడెన్‌బర్గ్‌లో జన్మించిన అతను మార్చి 2022లో కింగ్స్‌మీడ్, డర్బన్‌లో బంగ్లాదేశ్‌తో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు మరియు ఇప్పటివరకు రెండు టెస్టులు మాత్రమే ఆడిన ఈ పేస్ బౌలర్.. జూలై 16, 2021న తొలిసారి వన్డేల్లో ఐర్లాండ్‌తో డెబ్యూ చేసాడు. దేశీయ లీగ్ లో అతను SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్,కేప్ కోబ్రాస్,బోలాండ్ జట్ల కోసం ఆడాడు. 

పదునైన పేస్, స్వింగ్ అతని బలం. అవసరమైతే బ్యాటర్లని తన స్లో బాల్స్ తో బోల్తా కొట్టించగలడు. విలియమ్స్ కి ఇదే తొలి వరల్డ్ కప్ ట్రోఫీ. గత కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న విలియమ్స్ వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.