22మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు ఇతడే

22మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు ఇతడే

అక్టోబర్ 25న రాత్రి (యూఎస్ స్థానిక కాలమానం ప్రకారం) లూయిస్టన్, మైనేలో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో దాదాపు 22 మంది మరణించారు, 60 మందికి పైగా గాయపడ్డారు. మైనే ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ సెంటర్, ఈ సందర్భంగా ఓ నోట్ ను విడుదల చేసింది. ఈ ఘోరమైన సామూహిక కాల్పుల కేసులో నిందితుడి గురించి సమాచారాన్ని పంచుకుంది. నిందితుడిని రాబర్ట్ కార్డ్‌గా గుర్తించినట్టు వెల్లడించింది.

లెవిస్టన్‌లోని స్కీమేజీస్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్, స్పేర్‌టైమ్ రిక్రియేషన్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనకు సంబంధించి రాబర్ట్ కార్డ్‌ను గుర్తించేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారని నోట్ తెలిపింది. స్థానిక పోలీసులు ఫేస్‌బుక్‌లో రాబ‌ర్ట్ ఫొటోను కూడా రిలీజ్ చేశారు. అతన్ని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణిస్తూ.. పోస్టులో తెలిపారు.

రాబర్ట్ కార్డ్ ఎవరంటే..

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకారం, కార్డ్.. సైనికులకు తుపాకీ, ఇతర యుద్ధ వ్యూహానికి సంబంధించిన నైపుణ్యాల్లో శిక్షణిచ్చేవాడు. గ‌తంలో అత‌న్ని గృహ హింస కేసులో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో అత‌ను రెండు వారాల‌ పాటు మాన‌సిక చికిత్స తీసుకున్నాడు. మాన‌సిక రోగి అయిన కార్డ్‌.. మైనే రాష్ట్రంలో ఉన్న సాకో మిలిట‌రీ శిక్ష‌ణ కేంద్రంపై అటాక్‌కు ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మెంట‌ల్ హెల్త్ ఫెసిలిటీలో అత‌న్ని అడ్మిట్ చేశారు.

ALS0 READ: ధైర్యంగా ఓటెయ్యండి : గౌష్‌‌ ఆలం