యూకేకు మొదటి ముస్లిం పీఎంగా షబానా మహమూద్ ?

యూకేకు మొదటి  ముస్లిం పీఎంగా షబానా మహమూద్ ?
  •     ప్రధాని కీర్ స్టార్మర్ పదవికి ఎసరు తెచ్చిన ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైల్స్​
  •     ఆయన రాజీనామా చేయాలని వెల్లువెత్తుతున్న నిరసనలు
  •     తదుపరి ప్రధానిగా మార్మోగుతున్న షబానా మహమూద్ పేరు
  •     ప్రస్తుతం బ్రిటన్ హోమ్ సెక్రటరీగా షబానా బాధ్యతలు

లండన్:  బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో, దేశపు మొట్టమొదటి ముస్లిం ప్రధానిగా హోమ్ సెక్రటరీ షబానా మహమూద్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ వెస్ట్ మినిస్టర్ వర్గాల్లో చర్చ మొదలైంది. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌‌స్టీన్‌‌ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన పత్రాలు బ్రిటన్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. ఎప్‌‌స్టీన్‌‌తో సంబంధాలు ఉన్న పీటర్ మాండెల్సన్‌‌ను అమెరికాకు రాయబారిగా నియమించడంలో స్టార్మర్ వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తాయి. 

దీనికి బాధ్యత వహిస్తూ స్టార్మర్ ముఖ్య సలహాదారు మోర్గాన్ మెక్‌‌స్వీనీ రాజీనామా చేసినప్పటికీ, ప్రధానిపై ఒత్తిడి తగ్గలేదు.  ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో ఆయన పదవిలో కొనసాగడం ఇప్పుడు 50–-50 అవకాశంగానే కనిపిస్తున్నది. కీర్ స్టార్మర్ ఒకవేళ రాజీనామా చేస్తే, లేబర్ పార్టీలో తదుపరి లీడర్‌‌‌‌ను ఎన్నుకుంటారు. అందులో కనీసం 81 మంది ఎంపీల మద్దతు పొందితే బ్రిటన్ మొట్టమొదటి ముస్లిం ప్రధానమంత్రిగా షబానా మహమూద్‌‌ చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రధాని పదవి కోసం షబానాతో పాటు మరికొంతమంది ప్రముఖులు పోటీలో ఉన్నారు. మాజీ డిప్యూటీ పీఎం, పార్టీలో బలమైన కేడర్ గల నేత ఏంజెలా రేనర్‌‌‌‌, హెల్త్‌‌ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్, లేబర్‌‌‌‌ పార్టీ మాజీ నేత, ఎనర్జీ సెక్రటరీ ఎడ్ మిలిబాండ్‌‌నుంచి షబానాకు గట్టి పోటీ ఉన్నది. 

ఎవరీ షబానా మహమూద్ ?

 షబానా మహమూద్ (45)  ప్రస్తుతం బ్రిటన్ హోమ్ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బర్మింగ్‌‌హామ్‌‌లో జన్మించిన ఈమె తల్లిదండ్రులు పాక్‌‌ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌ (పీవోకే)లోని మీర్‌‌పూర్ ప్రాంతానికి చెందినవారు. షబానా మహమూద్ ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది, లాయర్‌‌‌‌గా పనిచేశారు. 2010లో బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళల్లో ఈమె ఒకరు.. 2025 సెప్టెంబర్‌‌లో కేబినెట్‌‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను హోమ్ సెక్రటరీగా నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి ముస్లిం మహిళకూడా షబానానే కావడం విశేషం.  లేబర్ పార్టీలోని రైట్‌‌ వింగ్‌‌ వాదిగా, స్పష్టమైన ప్రసంగాలతో ఆకట్టుకునే నాయకురాలిగా, అన్ని వర్గాలను సమన్వయం చేయగల ‘డార్క్ హార్స్’గా షబానాకు పేరున్నది. షబానా మహమూద్ వలసల విషయంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వలస వచ్చిన వారు బ్రిటన్‌‌లో శాశ్వత నివాసం పొందేందుకు ఉన్న కాలాన్ని 5  ఏండ్లనుంచి 10 ఏండ్లకు పెంచడంలో ఆమె పాత్ర ఉన్నది. షబానా కఠిన వైఖరి వల్ల మితవాద ఓటర్లను  ఆకట్టుకోవచ్చని, అదే సమయంలో పాలస్తీనా మద్దతుదారులతో పార్టీకి ఉన్న దూరాన్ని తగ్గించవచ్చని లేబర్ పార్టీ భావిస్తున్నది.