మంకీపాక్స్ పేరును మార్చుతాం : డబ్ల్యూహెచ్‌ఓ

మంకీపాక్స్ పేరును మార్చుతాం : డబ్ల్యూహెచ్‌ఓ

దాదాపు 30 దేశాలకు విస్తరించిన మంకీపాక్స్ వైరస్ పేరు మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ణయించింది. 30కి పైగా ఆంతార్జాతీయ శాస్త్రవేత్తలు మంకీపాక్స్ పేరును మార్చాలని సూచిచడంతో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ అతి త్వరలో మారుస్తామని తెలిపారు. పేరును వైరస్ రావడానికి గల కారణాలతో పెట్టాలని నిర్ణయించారు. డబ్ల్యూహెచ్‌ఓ రూల్స్ ప్రకారం భౌగోళిక ప్రాంతాలు, జంతువుల పేర్లను వాడకూడదు.   గ్లోబల్ హెల్త్ బాడీ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1,500 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, శోష‌ర‌స గంథ్రుల్లో వాపు, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం ఈ మంకీ పాక్స్‌ లక్షణాలుగా గుర్తించవచ్చు.