ఏపీ ఎన్నికల షెడ్యూల్లో జాప్యం - ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..!

ఏపీ ఎన్నికల షెడ్యూల్లో జాప్యం - ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..!

2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు, దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మొత్తం 7విడతల వారీగా ప్లాన్ చేసిన ఎన్నికల షెడ్యూల్లో తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో మే 13న  ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఈసీ. షెడ్యూల్ విడుదల తర్వాత ఎన్నికల హడావిడి మాట అటుంచితే, ఏపీలో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. అదేంటంటే, ఎన్నికల షెడ్యూల్లో జాప్యం వల్ల అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని.

ఏపీలో ఎన్నికలు 4వ విడతలో జరగటం వల్ల అధికార పక్షం కంటే విపక్షాలకే లాభం ఎక్కువని చెప్పచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీకి, ఎన్నికల తేదీకి మధ్య 57 రోజుల గ్యాప్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత రగిలిన అసమ్మతిని చల్లార్చేందుకు విపక్షాలకు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పాలి.

ALSO READ : భారీగా ప్లాన్ చేసిన కూటమి - 'ప్రజాగళం' సభకు పది లక్షల మంది..

 

మరో పక్క అధికార వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు, 25పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించేసింది కాబట్టి నేతలంతా ప్రచారాన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి. 58రోజుల పాటు ప్రచారం నిర్వహించాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది, ఇది వైసీపీకి ఒక మైనస్ అయితే, ఎన్నికల తేదీ వరకు తమ ఓట్ బ్యాంక్ ప్రతిపక్షాలకు షిఫ్ట్ అవ్వకుండా చూసుకోవటం మరొక పెద్ద టాస్క్ అని చెప్పాలి. మరి, ఈ 57రోజుల గ్యాప్ ని అధికార, విపక్షాలు ఎలా ఉపయోగించుకుంటాయో వేచి చూడాలి.