IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఆరో మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో హైదరాబాద్ జట్టును ఎదుర్కొననుంది. కోల్‌కతా నగరంలో జరిగే ఈ పోరు అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత సీజన్‌లో భిన్న ఫలితాలు సాధించిన ఈ రెండు జట్లు, ఈసారి ప్రారంభ మ్యాచులలో ఓడిపోయిన తర్వాత జరుగుతున్న ఈ కీలక పోరులో తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఇక KKR తమ సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుతో తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానం కేకేఆర్ కి ఒక బలమైన కోటగా నిలుస్తుంది. ఇక్కడ ఇరు జట్ల మధ్య జరిగిన 10 మ్యాచ్‌లలో 7 సార్లు కోల్‌కతా విజయం సాధించింది.
విజేత ఎవరు?:
SRH బ్యాటింగ్ లైనప్ అత్యంత భీకరంగా కనిపిస్తున్నప్పటికీ, ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలను ఎదుర్కోవడం హైదరాబాద్ బ్యాటర్లకు సవాల్‌తో కూడుకున్న పనే. అలాగే కామెరూన్ గ్రీన్, రింకూ సింగ్ లాంటి ఫినిషర్లు ఉండటం KKRకు కలిసొచ్చే అంశం. ఈ హోరాహోరీ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే హోమ్ అడ్వాంటేజ్‌తో పాటు బ్యాలెన్స్ టీమ్ కాంబినేషన్ కేకేఆర్‌కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
హెడ్ టు హెడ్ రికార్డులు
* KKR vs SRH జట్ల మధ్య10 మ్యాచ్‌లు
* 7 సార్లు విజయం సాధించిన KKR
* కేవలం 3 సార్లు మాత్రమే గెలిచిన SRH
తుది జట్ల అంచనా:
KKR:
ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), కెమెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ముజారబాని, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్
SRH:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, ఈషాన్ మలింగ, జయదేవ్ ఉనాద్కట్
