రేపే RCB vs GT మధ్య ఫైనల్ ఫైట్.. గెలిచేది ఎవరు!

రేపే RCB vs GT మధ్య ఫైనల్ ఫైట్.. గెలిచేది ఎవరు!

RCBvsGT: రెండు నెలల పాటు క్రికెట్ లవర్స్‌కు పూనకాలు తెప్పించిన ఐపీఎల్ (IPL 2026) క్లైమాక్స్ వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మే 31వ తేదీన రాత్రి 7: 30 గంటలకి జరగబోయే మహా సంగ్రామం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ టైటాన్స్ (GT) లీగ్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ ఫైనల్‌కు రెడీ అయిపోయాయి.

మ్యాచ్ విన్నర్ ఎవరంటే?: 
స్టాట్స్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బలంగా ఉన్నా, లక్ష మందికి పైగా వచ్చే హోమ్ క్రౌడ్ సపోర్ట్ శుభ్‌మన్ గిల్ ఆర్మీకి లక్ కలిసిరానుంది. అందుకే గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టే ఛాన్సెస్ 54 శాతం ఉన్నట్లు ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

టాస్ గెలిస్తే ట్రోఫీ పక్కా: 
అహ్మదాబాద్ పిచ్‌పై రాత్రి వేళ మంచు (Dew) ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకుని బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ ఈజీ అవుతుంది.

పరుగుల వరద ఖాయం: 
ఇరు జట్లలోనూ కోహ్లీ, గిల్, సాయి సుదర్శన్ వంటి క్లాస్ అండ్ మాస్ బ్యాటర్లు ఉండటంతో.. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 190+ దాటడం పక్కా అని ట్రెండ్స్ చెబుతున్నాయి.