DC vs RR: ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరకు చేరుకుంటున్న సమయంలో ఈరోజు (మే 17న) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ (RR) తలపడబోతున్నాయి. రెండు జట్లకూ ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్.
పిచ్ రిపోర్టు: ఢిల్లీ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే 'ఫ్లాట్ ట్రాక్'.. ఇక్కడి చిన్న బౌండరీల కారణంగా బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. రాత్రి వేళ మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.
మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్:
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయితే, ప్రస్తుత ఫామ్, టీమ్ బ్యాలెన్స్ పరంగా చూస్తే రాజస్థాన్ కి విజయావకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లతో కూడిన రాజస్థాన్ ఓపెనింగ్ జోడీ ఈ సీజన్‌లో అత్యంత స్థిరమైన ప్రదర్శన చేస్తోంది. కాగా, అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తమదైన రోజున ఎంతటి బలమైన జట్టునైనా చిత్తు చేయగలదు.. కాబట్టి రాజస్థాన్‌కు గట్టి పోటీ ఎదురవడం ఖాయం అని చెప్పాలి!
ఇరు జట్ల అంచనా:
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్
రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, బ్రిజేష్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: యశ్ పుంజా, తుషార్ దేశ్‌పాండే.
