గుజరాత్ vs రాజస్థాన్ మధ్య క్వాలిఫైయర్ 2 పోరు.. ఈరోజు ఫైనల్‌కు దూసుకెళ్లేది ఆ జట్టేనా?

గుజరాత్ vs రాజస్థాన్ మధ్య క్వాలిఫైయర్ 2 పోరు.. ఈరోజు ఫైనల్‌కు దూసుకెళ్లేది ఆ జట్టేనా?

GT vs RR Qualifier 2: ఐపీఎల్ 2026 క్లైమాక్స్ రేస్ పీక్స్‌కు చేరుకుంది. మే 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే గ్రాండ్ ఫినాలేలో తలపడే ఆ సెకండ్ టీమ్ ఏదో తేలిపోయే టైమ్ వచ్చేసింది. ఈరోజు న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు ఢీకొట్టబోతున్నాయి. 

టాస్ గెలిస్తే బాదుడే బాదుడు: 
ముల్లాన్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది నాకౌట్ ప్రెజర్ మ్యాచ్ కాబట్టి.. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలిమినేటర్‌లో ఇదే గ్రౌండ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 243 రన్స్ కొట్టిన కాన్ఫిడెన్స్‌తో.. ఆర్‌ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్‌కే మొగ్గు చూపవచ్చు.

మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్:
* రాజస్థాన్ రాయల్స్: ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌ను దంచికొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు. పైగా ఈ సీజన్‌లో ముల్లాన్‌పూర్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ గెలిచి అజేయంగా నిలిచింది.

* గుజరాత్ టైటాన్స్: క్వాలిఫైయర్ 1లో ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం పాలై కాస్త డల్‌గా ఉన్నా.. గుజరాత్ కి ప్లేఆఫ్స్ ఆడిన నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది.

వైభవ్ సూర్యవంశీ vs మహ్మద్ సిరాజ్: 
ఈ మ్యాచ్‌కు అసలైన ఎక్స్-ఫ్యాక్టర్ ఆర్‌ఆర్ 15 ఏళ్ల ఓపెనింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్‌లో 680+ రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను వన్-సైడ్ చేసే సూర్యవంశీని గుజరాత్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఎంత త్వరగా అవుట్ చేస్తారనేదానిపైనే గుజరాత్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

ఎవరు గెలుస్తారంటే: 
కాగా ప్రస్తుత ఫామ్, ముల్లాన్‌పూర్ గ్రౌండ్ రికార్డ్స్ చూస్తే రాజస్థాన్ రాయల్స్ (RR) గెలిచే అవకాశాలు 55 శాతం మాత్రమే ఉన్నాయి. కానీ శుభ్‌మన్ గిల్ ఆర్మీ పుంజుకుంటే మాత్రం మ్యాచ్ "లాస్ట్ ఓవర్ థ్రిల్లర్" అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.