బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావట్లే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావట్లే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: బీఏసీలో అన్ని అంశాలు చర్చించాలని పట్టుబట్టి సభ నుంచి బీఆర్ ఎస్ వాకౌట్ చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వాళ్ల వినతి మేరకు తాము అన్ని అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. 

సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి చిట్ చాట్ చేశారు.“పాలమూరు -రంగారెడ్డి పై చర్చ పెడితే భయపడిపోయారు. మీకు ఇబ్బంది అయిన రోజు వాకౌట్ చేశారంటే ఓకే కాని...మిగతా రోజులు ఎందుకు రావడం లేదు. ఉపాధి హామీ పథకం బీఆర్ఎస్ కు ఇంపార్టెంట్ కాదా” అని ఆయన ప్రశ్నించారు.