కెనడా క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ.. అసలు కారణం ఇదే?

కెనడా క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ.. అసలు కారణం ఇదే?

ICC suspend Cricket Canada: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అహ్మదాబాద్‌లో జరిగిన తన బోర్డు మీటింగ్ లో ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు గానూ కెనడా క్రికెట్ కెనడా బోర్డు (Cricket Canada) సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. బోర్డు బాధ్యతారాహిత్యం, పరిపాలనా లోపాల కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది.

ఆటగాళ్లకి నష్టం జరగొద్దు: 
బోర్డుపై వేటు పడినప్పటికీ, కెనడా అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్ల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా ఐసీసీ వెసులుబాటు కల్పించింది. బోర్డు అంతర్గత సమస్యల వల్ల ప్లేయర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో.. కెనడా జాతీయ జట్లు ఐసీసీ అధికారిక ఈవెంట్లలో యథావిధిగా పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా, నిధుల విషయంలో కూడా ప్లేయర్స్ కు ఇబ్బంది లేకుండా ఐసీసీ తన సొంత పర్యవేక్షణలో ఒక ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ద్వారా ఫండింగ్ చేయనుంది. 

ఐసీసీ ఏం చెప్పిందంటే: 
సభ్యత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనడా క్రికెట్ బోర్డు యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ నిర్ణయించింది. అయితే కెనడా ఆటగాళ్ల ప్రయోజనాలను రక్షించడం, జాతీయ బోర్డు సమస్యల వల్ల వారు నష్టపోకుండా చూసుకోవడం మాకు అత్యంత ముఖ్యం అని కౌన్సిల్ పేర్కొనింది. అందువల్ల, ఈ సస్పెన్షన్ కాలంలో కూడా కెనడా జాతీయ జట్లు ఐసీసీ టోర్నమెంట్లలో పాల్గొనడానికి పూర్తిగా అర్హత కలిగి ఉంన్నాయని వెల్లడించింది.