ఎక్కువ మందిని కనండి.. ఎక్కువ రేషన్ పొందండి

ఎక్కువ మందిని కనండి.. ఎక్కువ రేషన్ పొందండి

నైనిటాల్: ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ వేసుకునే వాళ్లు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ రీసెంట్‌‌గా వివాదాస్పద కామెంట్స్ చేసిన తీరత్.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎక్కువ రేషన్ కావాలనుకునే వాళ్లు మరింత మంది పిల్లల్ని కనాలని రావత్ కామెంట్ చేశారు. నైనిటాల్‌లోని రామ్‌‌నగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తీరత్.. కరోనా లాక్‌‌డౌన్‌‌లో కుటుంబంలో 20 మంది పిల్లలు కలిగిన వారితో పోల్చుకుంటే తక్కువ పిల్లలు కలిగిన ఫ్యామిలీలకు ప్రభుత్వం నుంచి తక్కువ రేషన్ అందిందన్నారు.

‘పేద కుటుంబాల్లో కేంద్రం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ అందిస్తోంది. ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే వారికి 50 కిలోల రేషన్ వస్తుంది. అదే ఫ్యామిలీలో 20 మంది పిల్లలు ఉంటే వారికి క్వింటాల్ రేషన్ అందుతుంది. ఇద్దరే ఉన్నవారికి 10 కిలోలే వస్తుంది. దీనికి ఎవర్నీ బద్నాం చేయలేం. వారిపై అసూయ ఎందుకు? మీకు సమయం ఉంది కదా.. ఇద్దరు పిల్లల్నే ఎందుకు కనాలి? 20 మంది పిల్లల్ని కనొచ్చు కదా?’ అని తీరత్ అనడంతో వివాదం రేగింది.