ఆదివారం వచ్చిన రథ సప్తమి.. చికెన్, మటన్ తినొచ్చా లేదా.. ?

ఆదివారం వచ్చిన రథ సప్తమి.. చికెన్, మటన్ తినొచ్చా లేదా.. ?

హిందువులు జరుపుకొనే పండుగల్లో రథ సప్తమి ఒకటి.  ఈ పండుగ సూర్య భగవానుడికి సంబంధించి పండుగ.. పురాణాల ప్రకారం.. మాఘమాసం శుద్ద సప్తమి రోజున సూర్య భగవానుడు జన్మించాడు.  సాధారణంగా ఆదివారం అంటే చాలు మన జనాలకు ముక్క లేనిదే ముద్ద దిగదు. కాని ఈ ఆదివారం ( జనవరి 25) రథ సప్తమి.  ఈ రోజు మాంసాహారం తినవచ్చా..  లేదా.. ఏంచేయాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .! 

పండితులు తెలిపిన వివరాల ప్రకారం .. సూర్య భగవానుడిని ఆరాధించే  రథసప్తమి  రోజున మాంసాహారం (చికెన్, మటన్) తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. హిందువులు పవిత్రదినాల్లో.. పండుగల సమయంలో .. కార్తీక మాసంలో.. ధనుర్మాసంలో.. చాలామంది నాన్​ వెజ్​కు దూరంగా ఉంటారు.  పండుగ దినాల్లో సాత్విక ఆహారం (శాకాహారం) తీసుకోవడం సంప్రదాయంగా అనాది కాలంగా వస్తున్న ఆచారం.  

సాధారణంగా మనవాళ్లు ఆదివారం నాన్​ వెజ్​ కు ప్రాధాన్యత ఇస్తారు.  ఈ ఆదివారం ( జనవరి 25) రథ సప్తమి కాబట్టి .. హిందువుల ఆచార సంప్రదాయాల ప్రకారం.. పండుగ పవిత్రతను కాపాడేందుకు మాంసాహారాన్ని తినకూడదని పెద్దలు చెబుతున్నారు.  

రథసప్తమి రోజున సూర్య భగవానుడిని ఆరాధించి.. సూర్యాష్టకం.. ఆదిత్యహృదయం చదవాలి.  ఈ రోజున సూర్య నమస్కారాలు చేసి ఉపవాసం ఉంటే చాలా మంచిది.  ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం ఉండలేని వారు శాఖాహారం భోజనం చేయాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.  పండుగ రోజుల్లో సాత్విక ఆహారం శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.రథ సప్తమి రోజున పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి  సూర్య భగవానుడికి నైవేద్యంగా పెడతారు. 

రథ సప్తమి రోజున మాంసాహారం తింటే.. జంతువులతో తయారు చేసిన ఎలాంటి వంటకాన్ని తిన్నా అదృష్టం పోయి.. దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు.  అంతేకాదు పండుగ సమయాల్లో సాధరణంగా కంటే ఎక్కువుగా తింటారు.  ఇలా అధికంగా  తినడం వలన జీర్ణ సమస్యలు.. కొలెస్ట్రాల్​ పెరగడం.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తారు. 

హిందువులు పండుగలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి రథ సప్తమి రోజు శాకాహారం తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత ..  ఆధ్యాత్మిక చింతనతో పాటు  క్రమశిక్షణ కలుగుతుందని నమ్ముతారు.  అందుకే చాలామంది పండుగలు.. ఆధ్యాత్మికంగా ప్రత్యేకత సంతరించుకున్న రోజుల్లో  ఆచారాల ప్రకారం మాంసాహారాన్ని నివారించాలని పెద్దలు చెబుతున్నారు.  పండుగ రోజుల్లో దేవుడికి పవిత్రమైన పూజలు, ఉపవాసాలు పాటిస్తారు. ఈ సమయంలో సాత్విక ఆహారం శరీరం మరియు మనస్సును శుద్ధి చేస్తుందని విశ్వశిస్తారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆరోగ్య సమస్యలకు వైద్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.