మీరెప్పుడైనా హోటల్స్ కు వెళితే ఇది గమనించారా.? పెద్ద పెద్ద హోటల్స్ చెక్ ఇన్ టైమింగ్స్ మధ్యాహ్నం 12pm నుంచి 2pm ల మధ్యనే ఉండటం వెనుక ఉన్న లాజిక్ గురించి ఆలోచించారా..? పెద్ద స్టార్ హోటల్స్ మాత్రమే కాదు.. సాధారణ హోటల్స్ కూడా టైమింగ్స్ సేమ్ పెట్టుకుంటుంటాయి. దీని వెనుక పెద్ద కారణం ఉంది. దీని వెనుక ఉన్న 5 రీజన్స్ ఏంటో తెలుసుకుందాం.
1.రూమ్స్ రీసెట్ చేసేందుకు సమయం కావాలి:
చెక్ ఇన్ టైమింగ్స్ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకే ఉండటం వెనుక.. రూమ్స్ రీసెట్ చేయడం ఒక ముఖ్య కారణం. ఎక్కువ శాతం అతిథులు ఉదయం 10 లేదా 11 గంటలకు రూమ్స్ ఖాళీ చేస్తుంటారు. అక్కడి నుంచి హౌస్ కీపింగ్ మొదలవుతుంది. రూమ్స్ క్లీ న్ చేయడమే కాకుండా.. శానిటైజ్ చేయడం, వస్తువులు నీట్ గా పెట్టడం, వాష్ రూమ్స్ ను క్లీన్ చేయడం తదితర పనులు మొదలుపెడతారు. పెద్ద పెద్ద హోటల్స్ లో హై ఆక్యుపెన్సీ రూమ్స్ ఉన్న హోటల్స్ లో ఇది చేసేందుకు చాలా టైమ్ పడుతుంది. అందుకే మధ్యాహ్నం చెక్ ఇన్ టైమింగ్ ఫాలో అవుతుంటాయి.
ఒకే టైమింగ్ తో ప్రయోజనాలు:
ఒకే టైమింగ్ మెయింటైన్ చేయడం వలన హోటల్ సిబ్బందికి చచాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా గెస్టుల రాక గురించి, అదే విధంగా హౌస్ కీపింగ్, సూపర్ వైజర్లు వారి షిఫ్టులను అడ్జస్ట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. దీంతో షార్ట్ టైమ్ లో రూమ్స్ సిద్ధం అవుతుంటాయి. ఒకే సమయం మెయిన్ టైన్ చేయడం వలన.. స్టాఫ్ కు కన్ఫూజన్ లేకుండా ఉపయోగపడుతుంది.
క్వాలిటీ చెక్స్:
క్లీనింగ్ సమయంలో అన్ని రూమ్స్ లలో ఉండే సమస్యలు బయటపడవు. చెక్ ఇన్, చెక్ అవుట్ సమయంలో లైట్స్ చెక్ చేసుకోవడం, ప్లంబింగ్ వర్క్స్, తయారీ సమస్యలు లేకుండా చూసుకుంటారు. అంతే కాకుండా హోటల్ క్వాలిటీ కోసం సూపర్ వైజర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పనులకు ఆటంకం కలగకుండా
తొందరగా చెక్ ఇన్ చేసుకుంటే.. హోటల్ స్టాఫ్ చేసే వర్క్ కు ఆటంకం కలుగుతుంది. హౌస్ కీపింగ్ వారిపై ఒత్తిడి పడుతుందుంది. స్టాఫ్ షెడ్యూల్ గందరగోళంగా మారుతుంది. అలా కాకుండా ఫిక్స్డ్ చెక్ ఇన్స్ వలన అన్నీ సరైన ప్లాన్ తో ముందస్తుగా ప్రిపేర్ అయ్యి ఉండవచ్చునని తెలుస్తుంది.
ఆక్యుపెన్సీ పెంచుకునేందుకు:
మధ్యాహ్నం చెక్ ఇన్స్ వలన రూమ్స్ ఆక్యుపెన్సీ పెంచుకోవచ్చు. 12 నుంచి 2 గంలలోపు చక్ ఇన్స్ పూర్తయితే ఏ రూమ్ ఖాళీగా ఉందో.. ఎంత మందిని అడ్జస్ట్ చేయవచ్చు అనే ప్లానింగ్ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. కొన్నిసార్లు రూమ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ చెక్ ఇన్ లోనే ఉన్నట్లు భావిస్తుంటారు. దీనికి కారణం ముందస్తుగా ప్లానింగ్ లేకపోవడం. వీటిని అధిగమించి ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ గా సార్ట్ అవుట్ చేసేందుకు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల చెక్ ఇన్ ఫాలో అవుతుంటారు.
