కవితకు మాత్రం ఎందుకు మినహాయింపు..? : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కవితకు మాత్రం ఎందుకు మినహాయింపు..? : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్య కాస్ట్లీ అయిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎంతో మంది విద్యార్థులు సహాయం కోసం తన దగ్గరకు వస్తున్నారని చెప్పారు. నాలుగు ఫ్లైఓవర్ లు, రెండు రోడ్లు వేస్తే అభివృద్ధా ? అని ప్రశ్నించారు. కార్యకర్తలు కోరుకున్న అభ్యర్థికే టిక్కెట్ వస్తుందని కోమటిరెడ్డి అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన... గెలిచిన ఎమ్మెల్యే లను పార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్ బలం అనుకుంటోందన్నారు. 

చిరుముర్తి లింగయ్య భార్య కూడా కాంగ్రెస్ లోనే ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ ఆఫీసుకు పిలిచి మరీ విచారణ చేశారని చెప్పారు. కవితకు మాత్రం ఎందుకు మినహాయింపు అని నిలదీశారు. కవిత ఇంటికి వెళ్లి ఎందుకు విచారణ చేయాలి..? సీబీఐ ఆఫీస్ కు  ఎందుకు పిలవడం లేదు.. ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పన్నాగం పన్నాయని కోమటిరెడ్డి ఆరోపించారు.