IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. 19వ సీజన్ గ్రాండ్ లీగ్‌లో 10 జట్లతో కిరికిరి మొదలైతే.. గిప్పుడు ఉత్కంఠభరితమైన రేసులో కేవలం నాలుగు జట్లు మాత్రమే మిగిలినాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్-2 లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు.. ఇవాళ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో క్వాలిఫైయర్ 1 పోరుకు సై అంటున్నాయి.
టాప్-2 టీమ్స్‌కు ప్లేఆఫ్స్ వలన లాభం?:
ఐపీఎల్‌లో సెమీ-ఫైనల్ పద్ధతిని పక్కనపెట్టి గీ 'ప్లేఆఫ్స్'ని తీసుకొన్ని దాదాపు 15 ఏళ్లు అవుతాంది. లీగ్ మ్యాచ్‌ల పొడుగునా గట్టిగా ఆడి దుమ్ములేపిన జట్లకు సరైన న్యాయం జరగాలనే గీ ఫార్మాట్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చింది. దీని వల్ల పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరడానికి రెండు ఛాన్సులు (Two Shots) దొరుకుతాయి. ఇవాళ క్వాలిఫైయర్ 1 లో గెలిచిన టీమ్ సీదా ఫైనల్‌కు పోతది. ఇక ఓడిపోయిన టీమ్ కి.. ఇంకో ఛాన్స్ ఉంటది. ఎలిమినేటర్ మ్యాచ్ (3వ ప్లేస్ vs 4వ ప్లేస్) లో గెలిచినోళ్లతో క్వాలిఫైయర్ 2 లో తలపడాలి.. అక్కడ గెలిస్తే మళ్లీ ఫైనల్ టికెట్ పక్కా అవుతుంది.
క్వాలిఫైయర్ 1 కొడితే 80 శాతం ఐపీఎల్ ట్రోఫీ ఖాయమా?
రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని ఆర్‌సీబీ, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జీటీ జట్లు ఇవాళ రాత్రి గ్రౌండ్‌లోకి దిగుతుంటే మైండ్‌లో ఒకటే లెక్క తిరుగుతా ఉంటది. గత 15 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీని చూస్తే, క్వాలిఫైయర్ 1 లో జెండా పాతిన టీమే ఏకంగా 12 సార్లు ఐపీఎల్ కప్పును ఇంటికి పట్టుకపోయింది! అంటే నూటికి 80 శాతం సార్లు క్వాలిఫైయర్ 1 విన్నరే ఐపీఎల్ బాద్‌షా అవుతున్నాడన్నమాట. అందుకే ఈరోజు రాత్రి మ్యాచ్ గెలవడం అనేది ఊరికే ఫైనల్ పోవడానికి మాత్రమే కాదు.. ట్రోఫీ కొట్టే ఛాన్స్‌ను 80 శాతం పెంచుకోవడానికి కూడా చానా ఇంపార్టెంట్ అన్నమాట.
ఎలిమినేటర్ నుండి వచ్చి కప్ కొట్టింది ఎవరు?:
ఐపీఎల్ చరిత్రలో కేవలం మూడు సార్లు (2013, 2016, 2017) మాత్రమే క్వాలిఫైయర్ 1 లో గెలిచిన జట్లు ఫైనల్లో బోర్లా పడ్డాయి. ముంబై ఇండియన్స్ టీమ్ మాత్రమే 2013, 2017లలో క్వాలిఫైయర్ 1 లో ఓడిపోయినా, క్వాలిఫైయర్ 2 లో విజయం సాధించి టైటిల్ గెలిచి రికార్డు సృష్టించింది. ఇక 2016 లో అయితే అసలు సిసలైన ట్విస్ట్ నెలకొంది. అప్పుడు డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ క్వాలిఫైయర్ 1 ఆడకుండానే.. ఎలిమినేటర్ లో కేకేఆర్‌ను, క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ లయన్స్‌ను, ఆఖరికి ఫైనల్లో ఆర్‌సీబీని ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది.
బెంగళూరు హిస్టరీ క్రియేట్ చేస్తదా?
ఈరోజ రాత్రి జరిగే క్వాలిఫైయర్ 1 పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కే విన్నింగ్ ఛాన్సెస్ మస్తుగా ఉన్నాయని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ ప్లేస్‌లో దూసుకుపోయిన ఆర్‌సీబీకి ధర్మశాల గ్రౌండ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. మొన్ననే ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సూపర్ విక్టరీ కొట్టిండ్రు.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ టీమ్ ఈ సీజన్‌లో ధర్మశాల పిచ్‌పై ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. పాత రికార్డులతో పాటు ప్రస్తుతం ఆర్సీబీలో విరాట్ కోహ్లీ (577 పరుగులు) భీకరమైన ఫామ్‌లో ఉండటం చూస్తుంటే.. గీ సారి మ్యాచ్ గెలిచి, వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ట్రోఫీని డిఫెండ్ చేసుకునేందుకు బెంగళూరు గట్టిగానే స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. మరి గీ హై-వోల్టేజ్ పోరులో ఫైనల్ చేరే ఆ 'టాప్' టీమ్ ఏదో వేచి చూడాలి.
