
‘హరిహర వీరమల్లు’ రేపు (జూలై 24న) గ్రాండ్గా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పలుచోట్ల #BoycottHHVM ట్యాగ్ ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. హరిహర వీరమల్లు సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఓ పొలిటికల్ పార్టీ ఫ్యాన్స్తో పాటు మరికొంత స్టార్ హీరోల ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ఇటీవలే జరిగిన వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందుకు కారణమని ఈ సదరు ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అని చెప్పే పవన్ కళ్యాణ్.. సినిమా ఫంక్షన్లో రాజకీయాలపై మాట్లాడటం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు.
సినిమా వాళ్ళు ఇంకా మారారా ??#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !! pic.twitter.com/qAJzYhjj6f
— cinee worldd (@Cinee_Worldd) July 21, 2025
అయితే, పవన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ.. ‘‘నేను క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చాకనే రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కొవాల్సి వచ్చింది. కానీ, సినిమాల్లో మాత్రం ఫైట్లు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడో నేర్చుకున్నా మార్షల్ ఆర్ట్స్ ను మళ్లీ వీరమల్లు కోసం తిరిగి ప్రాక్టీస్ చేశానని మాట్లాడారు’’.ఇపుడీ ఈ మాటలే వీరమల్లు విడుదలకి ఆటంకంగా మారాయి.
పవన్ కళ్యాణ్ సైతం ఈ బైకాట్ విషయం గురించి స్పందించారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో, రాజకీయ ప్రత్యర్థులు సినిమాను బహిష్కరించాలని అడుగుతున్నారని అడిగినప్పుడు, పవన్ ఎందుకని ప్రశ్నించాడు. వ్యక్తిగత కక్ష సాధింపు తప్ప వేరే పెద్ద కారణంలేదని భావించిన పవన్.. దాని గురించి నవ్వుకున్నారు. మరి ఈ రాజకీయాల వేడి.. సినిమాకు ఎలాంటి నిప్పు పుట్టిస్తుందో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.
సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడతారా..
— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) July 21, 2025
ముందు ముందు ఉంది రా మీకు జాతర..
YCP boys.. HHVM is a disaster movie #BoycottHHVMpic.twitter.com/U2d1IoQjeb
అంతేకాకుండా ఈ బాయ్ కాట్ ప్రభావం వీరమల్లు వసూళ్లపై పడే అవకాశముందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి ఇన్ని అడ్డంకుల మధ్య వీరమల్లు ఎలాంటి ఓపెనింగ్ అందుకుంటుందో చూడాలి.