వరల్డ్ వార్ : ఇండియా బ్యాటింగ్

వరల్డ్ వార్ : ఇండియా బ్యాటింగ్

మాంచెస్టర్ : వరల్డ్ కప్ -2019లో భాగంగా మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది భారత్. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుస విక్టరీలతో జోరుమీదున్న టీమిండియా ..ఇవాళ్టి మ్యాచ్ లోనూ అదే ఊపును కోనసాగించాలని చేస్తుంది. న్యూజిలాండ్ తో విక్టరీని జస్ట్ మిస్ అయిన విండీస్ ..ఈ మ్యాచ్ లో గెలిచి పరువునిలబెట్టుకోవాలనుకుంటుంది.

ఐదు మ్యాచ్‌ల్లో ఒకటి క్యాన్సిల్ కాగా.. నాలుగు గెలిచి 9 పాయింట్లతో టీమిండియా సెమీస్‌కు చేరువలో ఉంటే.. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓడి 3 పాయింట్లతో వెస్టిండీస్ నాకౌట్ ఆశలను ఆల్మోస్ట్ గల్లంతు చేసుకుంది. అంచనాలకు తగ్గట్టు దుమ్మురేపి కోహ్లీసేన విండీస్‌ను మట్టికరిపిస్తే ఇక సెమీస్‌బెర్త్ దాదాపు ఖరారైనట్టే.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..