కోల్‌బెల్ట్, వెలుగు: ప్రతి రోజు వేధిస్తున్నాడని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం శాంతినగర్‌కు చెందిన ఎండీ మోహిన్(42)ను అతని భార్య హత్య చేసింది. వివరాలిలా ఉన్నాయి.. డ్రైవర్‌గా పని చేసే మోహిన్, సుక్కల అవంతి పదేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిద్దరి మధ్య తరచూ డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. అవంతి కోపంతో మోహిన్ మెడపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి టౌన్ ఎస్సై గోపతి నరేశ్ తెలిపారు.
