పోస్ట్ మార్టమ్ లో తేలిన అసలు నిజం: భార్య అరెస్ట్

పోస్ట్ మార్టమ్ లో తేలిన అసలు నిజం: భార్య అరెస్ట్

హైదరాబాద్: భర్తను చంపిన భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ లోని తుకారం గేట్ లో డిసెంబర్-26న భర్త రవికుమార్ ను తీగతో ఉరివేసి చంపిన అతడి భార్య .. గుండె పోటుతో మరణించాడని పోలీసులకు తెలిపింది. అయితే పోస్ట్ మార్టమ్ లో అతడు హార్ట్ ఎటాక్ తో చనిపోలేదని.. ఉరివేసి చంపినట్లు తెలింది.

దీంతో  పోలీసులు అతడి భార్యపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపడింది. తానే తన భర్తను పడుకున్నప్పుడు ఉరేసి చంపానని భార్య నేరం ఒప్పకున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితురాలిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించామని చెప్పారు పోలీసులు.