భర్తను ముక్కలు ముక్కలుగా నరికించిన భార్య

 భర్తను ముక్కలు ముక్కలుగా నరికించిన భార్య

గోదావరిఖని, వెలుగు: తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే ప్రియుడితో కలిసి భర్తను ముక్కలుముక్కలుగా నరికి చంపించిన కేసును పోలీసులు ఛేదించారు. రామగుండం సీపీ ఎస్‌‌.చంద్రశేఖర్‌‌‌‌ రెడ్డి వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ధన్వంతరి హాస్పిటల్​లో కాంట్రాక్ట్ ​నర్సుగా పనిచేస్తున్న కాంపెల్లి హేమలత, హాస్పిటల్​ ఆవరణలోని మీ సేవలో పనిచేసే శంకర్ భార్యాభర్తలు. అదే హాస్పిటల్​లో కాంట్రాక్ట్​ స్వీపరుగా పనిచేసే పొయిల రాజు, హేమలత చనువుగా ఉండడం గమనించిన శంకర్​ భార్యను మందలించాడు. శంకర్ తనను అనుమానిస్తున్నాడని హేమలత రాజుకు చెప్పకుని బాధపడేది. అలా వారి స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

తర్వాత భర్త మాటలు వినకపోగా తిరిగి భర్తపైనే పోలీస్ ​కేసు పెట్టింది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని రాజుతో కలిసి స్కెచ్ ​వేసింది. ముందస్తుగా రాజు రెండు కత్తులు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాడు. ఈ నెల 25న రాత్రి 10.30కు శంకర్​రాజుకు ఫోన్​చేసి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అదే అదునుగా భావించిన రాజు.. శంకర్​ను తన ఇంటికి పిలిచాడు. మందు తాగించి బీర్​బాటిల్​తో శంకర్‌‌‌‌ తలపై కొట్టాడు. కుప్పకూలిన వెంటనే రెండు కత్తులతో శంకర్​తలపై విచక్షణా రహితంగా పొడవడంతో మృతి చెందాడు. తర్వాత రాజు తల, కాళ్లు, చేతులను నరికి వేర్వేరు సంచుల్లో వేశాడు. శంకర్​ బైక్​ పైనే వెళ్లి మల్యాలపల్లి, బసంత్‌‌‌‌ నగర్‌‌‌‌ ప్రాంతాల్లో శరీర భాగాలను విసిరేశాడు.

తర్వాతి రోజు హాస్పిటల్‌‌‌‌ కు వెళ్లి అంతా ప్లాన్​ ప్రకారం చేశానని, ఇంట్లో ఇంకా మొండెం, మోకాళ్ల వరకు రెండు భాగాలున్నాయని ప్రియురాలు హేమలతకు చెప్పాడు. వాటిని కూడా పారేయాలని ఆమె చెప్పడంతో మొండెం భాగాన్ని మేడిపల్లి ఓసీపీ నిర్మానుష ప్రదేశంలో పడేసి వచ్చాడు. అదేరోజు  సాయంత్రం మిగిలిన భాగాన్ని సప్తగిరి కాలనీ వద్ద విసిరేశాడు. శంకర్‌‌‌‌ తల్లి పోచమ్మ తన కొడుకు కనిపించడం లేదని 26న ఎన్టీపీసీ పీఎస్​లో కేసు పెట్టడం, 27న మల్యాలపల్లి వద్ద శంకర్​తల, చేతులు కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుట్టు రట్టైంది. పోలీసులు రాజు, హేమలతను సోమవారం రిమాండుకు తరలించారు.