ప్రియుడితో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్య

V6 Velugu Posted on Jun 12, 2021

భైంసా: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా, భైంసాలోని ఏపీ నగర్‌లో జరిగింది. సదరు వివాహిత ఐదేళ్ల కిందట రాజు అనే యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొంతకాలం నుంచి ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె.. ప్రియుడితో కలసి గదిలో ఉన్నప్పుడు గమనించిన భర్త రాజు బయటి నుంచి గదికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య కూడా గది లోపలి నుంచి గడియ పెట్టుకొని 4 గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించింది. ఎట్టకేలకు వారిని పోలీసులు పట్టుకున్నారు. 

Tagged HUSBAND, Wife, Police arrested, extramarital affair, Bhainsa, Boy Frined

Latest Videos

Subscribe Now

More News