అడవుల్లో ప్రకృతి అందాలు అప్పుడప్పుడూ అరుదైన దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. అలాంటి ఓ ఆసక్తికర సన్నివేశం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తానిమడుగు ఫారెస్ట్ బీట్ పరిధిలో కనిపించింది. వేసవి దృష్ట్యా వన్యప్రాణుల దాహాన్ని తీర్చేందుకు అటవీ అధికారులు అడవిలో నీటి మడుగు(సాసర్పిట్) ఏర్పాటు చేశారు. రాత్రి వేళ అడవిపందుల గుంపు అక్కడికి వచ్చి ఒకే వరుసలో నిలబడి నీరు తాగుతున్న దృశ్యం ట్రాకింగ్ కెమెరాకు చిక్కింది.
ఈ చిత్రం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. మండుతున్న ఎండల వేళ సాసర్ పిట్స్ అడవిజంతువుల గొంతు తడుపుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు ఉపయోగపడుతున్నాయని ఈ దృశ్యం రుజువు చేస్తోంది. - మంచిర్యాల, వెలుగు

