కేంద్రం వద్ద 80 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయా?

కేంద్రం వద్ద 80 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయా?

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌‌ను తయారు చేసే పనుల్లో విదేశీ సంస్థ ఆస్ట్రాజెనెకాతో కలసి సీరం ఇన్‌స్టిట్యూట్ బిజీగా ఉంది. పూనే కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించే సీరం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ పూనమ్‌‌వల్లా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఆసక్తికరమైన ప్రశ్న సంధించారు. ఇండియాలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ వేయడానికి కలిపి మొత్తంగా అయ్యే ఖర్చు రూ.80 వేల కోట్లని, వచ్చే ఏడాదికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఇంత డబ్బు అందుబాటులో ఉంటుందా అని క్వశ్చన్ చేశారు. వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకురావడం, అందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి అంత మొత్తం డబ్బు అవసరం అవుతుందన్నారు. దేశం తదుపరి ఎదుర్కోబోయే అతి పెద్ద సవాల్ ఇదేనన్నారు. వ్యాక్సిన్ తయారీదారులను గైడ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు సేకరణ, సరఫరాకు భారీ మొత్తంలో డబ్బులు కావాల్సిందేనన్నారు.