
హైదరాబాద్, వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ వ్యాపార వేత్త ఏలేటి సురేశ్‌రెడ్డి తెలిపారు. బీజేపీ అధిష్టానం తనకు అవకాశం కల్పిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గురువారం కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సురేశ్‌రెడ్డి తెలిపారు.