- ప్లాస్మా థెరపీని కొనసాగిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ పద్ధతిలో ట్రీట్‌మెంట్ చేయొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్లాస్మా థెరపీ వల్ల మంచి రిజల్ట్ ఉందని, ట్రయల్స్ కొనసాగిస్తామని శుక్రవారం ప్రకటించారు. రిజల్ట్ బాగా ఉందని, అందుకే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. “ ప్లాస్మా థెరపీ ట్రయల్స్ చేసేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌లో ట్రయల్స్ చేస్తున్నాం. ఫస్ట్ పేషంట్ రికవర్ అయ్యాడు. సీరియస్ కండిషన్ నుంచి కూడా బయటపడ్డాడు” అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో కోలుకున్న 1100 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో ఇప్పటి వరకు దాదాపు 3500 కరోనా కేసులు నమోదు కాగా.. 59 మంది చనిపోయారు.
