కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీకి ఎన్ని వేల ఎకరాలైనా ఇస్తాం : దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీకి ఎన్ని వేల ఎకరాలైనా ఇస్తాం : దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కాజీపేట, వెలుగు: కాజీపేటలో కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్ని వేల ఎకరాలైనా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సికింద్రాబాద్ నుంచి వారణాసికి వెళ్తున్న భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆత్మ గౌరవ్ ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాజీపేట రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మేయర్ గుండు సుధారాణితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజీపేట నుంచి వెళ్తున్న 65 మందికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శక్తులకు అప్పగించి సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని సూచించారు. కాజీపేటలో కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీల సాధనకు ప్రజల తరఫున ఉద్యమం చేస్తామన్నారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటనకు ఏర్పాట్లు చేయండి


హనుమకొండ, వెలుగు : వచ్చే నెల 5న వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరగనున్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని విప్ దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి శనివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అనంతరం హనుమకొండ వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మోడ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్మశానవాటికతో పాటు, హంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డులోని సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పార్క్​, కార్మిక భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్థలాన్ని పరిసీలించారు. రివ్యూలో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీపీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హనుమకొండ, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య  పాల్గొన్నారు. అనంతరం హనుమకొండలోని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ మే1 నుంచి పశ్చిమ నియోజకవర్గంలో కార్మిక సంక్షేమ మాసోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు.