జనగామ, వెలుగు: కరెంట్ షాక్ తో లైన్ మెన్ చనిపోయాడు. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా గుండాల మండలం పెద్ద పడిశాలకు చెందిన రాచమల్ల కరుణాకర్‌రెడ్డి (45) జనగామలో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున చీటకోడూరు రిజర్వాయర్ ఫిల్టర్ బెడ్ వద్ద కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో మోటార్లు ఆగిపోయాయి.
నైట్ డ్యూటీలో ఉన్న కరుణాకర్‌రెడ్డి, అసిస్టెంట్ లైన్మెన్కుమార్ ఫిల్టర్ బెడ్ వద్దకు చేరుకున్నారు. కరుణాకర్ రెడ్డి అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి తనిఖీ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు స్తంభంపైనే చనిపోయాడు.
