ఐ బొమ్మ రవికి బెయిల్ వస్తుందా ? ఒకవేళ బెయిల్ వచ్చినా మళ్లీ జైలుకేనా ?

ఐ బొమ్మ  రవికి బెయిల్ వస్తుందా ?  ఒకవేళ బెయిల్ వచ్చినా మళ్లీ జైలుకేనా ?

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై మంగళవారం (డిసెంబర్ 03) నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే బెయిల్ పై గత 2 రోజుల క్రితం  వాదనలు ముగిశాయి దీంతో రవికి బెయిల్ వస్తుందా, లేదా ? అనే చర్చనడుస్తోంది. 

రవిపై ఉన్న మిగతా 4 కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టు ఇప్పటికే పిటి వారెంట్ కు అనుమతించింది. ఈ క్రమంలో బెయిల్ వస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. రవి పిటి వారెంట్ కేసులకు సంబంధించి ఐదు రోజుల పాటు కస్టడీ పిటిషన్ వేయనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. దీంతో బెయిల్ వచ్చినా మళ్లీ జైలుకే వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల విచారణలో  రవి తన దందాను  కేవలం పైరసీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కాకుండా.. అనేక అక్రమ కార్యకలాపాలు నిర్వహించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీని వెనుక అంతర్జాతీయ లింకులు కూడా ఉన్నాయని తేలింది.

రవి ఐబొమ్మతో పాటు 'బప్పం' (bappam.TV) పేరు మీద 17 ప్రధాన వెబ్‌సైట్‌లు , 65కు పైగా మిర్రర్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ పైరసీ సామ్రాజ్యం ఎంత విస్తరించిందంటే.. ప్రతి నెలా సుమారు 3.7 మిలియన్ల యూజర్లు ఈ సైట్‌లలో లాగిన్ అవుతున్నారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించుకుని.. రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్‌లకు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు తేలడంతో, ఈ కేసు మనీలాండరింగ్ కోణం వైపు మళ్లింది.