
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టు దాడి ఘటనపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లు వేసి భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారా అంటూ పిటిషనర్లు ఫతేష్ కుమార్ షాహు, మహమ్మద్ జునైద్, విక్కీ కుమార్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా సైన్యం చేపట్టిన దర్యాప్తును న్యాయవ్యవస్థ ఎందుకు పర్యవేక్షించాలని కోరుకుంటున్నారని ప్రశ్నించింది.
మీకు కూడా ఈ దేశం పట్ల బాధ్యత ఉందని, హుందాగా నడుచుకోవాలని సూచించింది. దీనికి సమాధానంగా పిటిషనర్ల తరఫు లాయర్.. తమ అప్పీల్‌ను పరిశీలించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోని కాశ్మీరీ విద్యార్థుల భద్రతో కోసమే పిల్ దాఖలు చేసినట్లు వివరించారు. విద్యార్థుల గురించే అయితే హైకోర్టులో అప్పీల్ చేస్కోవాలని కోర్టు సూచించింది.
ప్రతివ్యక్తి చేతులు కలిపి దేశంకోసం నిలవాల్సిన కీలక సమయమిదని పేర్కొంది. దీంతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని వాపస్ తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.