మాజీ సీఎం అధికార నివాసాన్ని కొత్త సర్కార్ కూల్చేస్తుందా?

మాజీ సీఎం అధికార నివాసాన్ని కొత్త సర్కార్ కూల్చేస్తుందా?

మాజీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసాన్ని కొత్తగా ప్రభుత్వం కూల్చేస్తుందా? తాము అధికారంలోకి రాగానే ఆ భవనాన్ని కూల్చేస్తామన్న వైఎస్సార్సీపీ అన్నంత పని చేస్తుందా? లేక సైలెంట్ గా ఉంటుందా? ప్రస్తుతం ఇదే టాపిక్ పై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. కృష్ణా నది కరకట్టపై లింగ‌మ‌నేని ఎస్టేట్ లో ఇళ్లును అక్ర‌మంగా నిర్మించార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అదే  బిల్డింగ్ ను చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు.  అక్క‌డి నుంచే తన పదవి కాలాన్ని పూర్తి చేశారు. రివ‌ర్ క‌న్జ‌ర్వేటివ్ యాక్ట్ కు, న్యాయ‌స్థానం న‌దుల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో ఇచ్చిన తీర్పుల‌కు ఇది విరుద్ధంగా జ‌రిగిన నిర్మాణమనే ప్రచారం ఉంది.

ప్రస్తుతం కొత్త సీఎం జగన్ తాడేపల్లిలో ఉన్న తన నివాసం నుంచే పరిపాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా అయితే కృష్ణా నది కరకట్టపై ఉన్న మాజీ సీఎం అధికార నివాసాన్నిజగన్ వాడుతారా? లేక కూల్చేస్తారా? అనే దానిపై  చర్చ జరుగుతోంది. మాజీ సీఎం అధికారిక నివాసాన్ని కూల్చేయాలని పార్టీ నుంచి డిమాండ్ ఉన్నా జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో? అనే దానిపై  సస్పెన్స్ గా ఉంది.