Akaay: విరాట్ కోహ్లీ కుమారుడికి బ్రిటిష్ పౌరసత్వం.. రూల్స్ ఏమంటున్నాయి?

Akaay: విరాట్ కోహ్లీ కుమారుడికి బ్రిటిష్ పౌరసత్వం.. రూల్స్ ఏమంటున్నాయి?

భారత క్రికెట్‌ స్టార్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ దంపతులు ఇటీవల తమ జీవితంలోకి రెండో సంతానాన్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతనికి వారిద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా అకాయ్‌(Akaay) అని నామకరణం చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అకాయ్‌కు ఏ పౌరసత్వం వర్తిస్తుందన్నది ఇప్పుడు తెరమీదకు వస్తున్న ప్రశ్న. కోహ్లీ కుమారుడికి బ్రిటీష్ పౌరసత్వం అంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పిల్లాడికి బ్రిటీష్ పౌరసత్వం సాధ్యమేనా..! రూల్స్ ఏంటి..? అనేది తెలుసుకుందాం.. 

నిబంధనల ప్రకారం.. యునైటెడ్ కింగ్‌డమ్‌లో జన్మనిచ్చినప్పటికీ, పుట్టిన బిడ్డను బ్రిటిష్ పౌరుడిగా పరిగణించరు. వారి తల్లిదండ్రులలో ఒకరు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నా లేదా ఎక్కువ కాలం అక్కడ నివసించి స్థిరపడినట్లయితే.. వారు బ్రిటిష్ పౌరులుగా మారగలరు. అదేవిధంగా, బ్రిటిష్ పౌరసత్వం తల్లిదండ్రులు యూకే వెలుపల ఒక బిడ్డకు జన్మించినట్లయితే.. వారి తల్లిదండ్రులు బ్రిటిష్ పౌరసత్వాన్ని ఎలా పొందారు అనేదానిపై ఆధారపడి వారు బ్రిటిష్ పౌరులు కావచ్చు.

భారత పౌరుడే..

ఇక అకాయ్‌ విషయానికొస్తే.. కోహ్లీ, అనుష్క శర్మ జంట లండన్‌లో ఇల్లు కొన్నప్పటికీ, అతను బ్రిటిష్ పౌరుడు కాలేడు. భారతీయ పౌరుడిగానే ఉంటాడు. అయితే, అతనికి బ్రిటన్ ప్రభుతం పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తుంది.

Also Read : అంచనాలను..అందుకోలేకపోయా