వెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిల్ చేయను.. ఢిల్లీకి డీకే శివకుమార్

వెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిల్ చేయను.. ఢిల్లీకి డీకే శివకుమార్

కర్ణాటకలో సీఎంగా ఎవరి పదవీ పగ్గాలు చేపట్టబోతున్నారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫీ డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవర్నీ వెన్నుపోటు పొడవనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనని వ్యాఖ్యానించారు.

సీఎం ఎవరిని నియమించాలన్న నిర్ణయంపై అధిష్టానం ఇప్పటికే మంతనాలు ప్రారంభించింది. అందులో భాగంగా రేసులో ఉన్న సిద్దరామయ్య, డీకే శివ కుమార్ లను ఢిల్లీకి ఆహ్వానించగా.. సిద్దరామయ్య మే 15నే ఢిల్లీకి వెళ్లిపోయారు. కానీ డీకే శివకుమార్ తన జన్మదిన వేడుకల నిమిత్తం, ముఖ్యంగా అనారోగ్య కారణాల వల్ల ఆయన బెంగళూరులోనే ఉండిపోయారు. మే 16న ఢిల్లీకి పయనమైన డీకే శివకుమార్.. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. వెన్నుపోటు పొడవనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనని చెప్పారు. పార్టీ కోరుకుంటే తనకు బాధ్యతలు ఇవ్వగలదన్న ఆయన.. తమది సమైఖ్య కుటుంబం అని, తమకు 135మంది బలముందని, తాను ఎవరినీ డివైడ్ చేయాలనుకోవడం లేదని తెలిపారు. తనను ఇష్టపడినా, ఇష్టపడకపోయినా తానొక బాధ్యత గల మనిషిని అంటూ డీకే శివకుమార్ చెప్పారు.

ఈ రోజు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లనుండడంతో సాయంత్రం లోగా కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టత రానుందని పలువురు భావిస్తున్నారు. నూతన సీఎం ప్రమాణ స్వీకారం గురువారం అంటే మే 18న జరగనుండగా.. ఆ రోజే మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహులే గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్టు సమాచారం.

https://twitter.com/ANI/status/1658327525834252289