మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా భారత్‌కు టెన్షన్ పెరుగుతుంది. అందుకే మన రిఫైనరీలు రూట్ మార్చి వెనిజులా నుండి క్రూడ్ దిగుమతులను భారీగా పెంచాయి. కట్ చేస్తే.. ఇప్పుడు అక్కడ ప్రకృతి పగబట్టింది. వెనిజులాను వణికించిన భారీ భూకంపం, భారత్ ఆయిల్ ప్లాన్లపై గట్టి దెబ్బే కొట్టింది.
హార్ముజ్ పోయి.. వెనిజులా వచ్చి
ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో.. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' గుండా ఆయిల్ సరఫరా సజావుగా సాగుతుందని భారత్ ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఏప్రిల్, మే నెలల్లో భారత్‌కు మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ సప్లయర్‌గా మారిన వెనిజులాలో భూకంపం రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
పోర్టులు సేఫ్.. కానీ పవర్ కట్
ఎడ్మీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఎగ్జిక్యూటివ్ కునాల్ ఖన్నా విశ్లేషణ ప్రకారం.. వెనిజులాలోని ఆయిల్ ఎక్స్‌పోర్ట్ టెర్మినల్స్ సురక్షితంగానే ఉన్నా, భూకంపం సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు. దేశంలో విపరీతమైన పవర్ కట్స్, రోడ్ నెట్‌వర్క్ ధ్వంసం కావడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఆయిల్ షిప్‌ల కదలికలు పూర్తిగా నెమ్మదించాయి. ముఖ్యంగా అక్కడి ప్రధాన కార్గో పోర్ట్ 'లా గుఐరా'ను డిజాస్టర్ జోన్‌గా ప్రకటించడంతో షిప్పింగ్ ఆపరేషన్లు నిలిచిపోయాయి.
జేబులు ఖాళీ అవుతాయా?
ఇప్పుడు అందరి మైండ్‌లో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? అని. దీనికి డైరెక్ట్ ఆన్సర్ లేదు కానీ.. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ గట్టిగానే ఉండబోతోంది. షిప్‌లు పోర్టుల్లో ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి రావడం వల్ల డెమరేజ్ ఛార్జీలు, షిప్ రెంట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరుగుతాయి. ఈ అదనపు భారం రిఫైనరీలపై పడితే, లాంగ్ రన్‌లో అది సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే ప్రమాదం ఉంది.
ఇన్సూరెన్స్ కంపెనీల రూట్ చేంజ్
ఇప్పటివరకు వెనిజులా రూట్‌లో వచ్చే షిప్‌లకు కేవలం అంతర్జాతీయ ఆంక్షలు, జియోపాలిటికల్ రిస్క్‌లను బట్టి ఇన్సూరెన్స్ పాలసీలు డిజైన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రకృతి వైపరీత్యాలను కూడా లెక్కల్లోకి తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వ రంగ సంస్థ ONGC విదేశ్ సైతం వెనిజులా ఆయిల్ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఎక్స్‌పోర్ట్స్ ఇలాగే నిలిచిపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి.
ఇటీవలే ప్రధాని మోదీ, వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ మైనింగ్, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్ల గురించి చర్చించారు. కానీ ఈ భూకంపం సృష్టించిన సంక్షోభంతో ఆ ప్లాన్స్ అన్నీ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడేలా కనిపిస్తున్నాయి.
