నర్సింహులు ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షిస్తాం: మంత్రి హరీశ్ రావు

నర్సింహులు ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షిస్తాం: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన రైతు బ్యాగరి నర్సింలు మృతుడికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి  హరీశ్ రావు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇవాళ సిద్దిపేటకు వచ్చిన ఆయన…మృతుడు బ్యాగరి నర్సింహులు కుటుంబ సభ్యులను కలిశారు. బాధిత కుటుంబానికి ఎకరా భూమి, ఎక్సేగ్రేషియాను అందిస్తామని ప్రకటించారు. నర్సింలు పిల్లల చదువులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామన్నారు. అంతేకాదు నర్సింలు ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి హరీశ్. ప్రభుత్వం మీద కొందరు బురద చల్లే చర్యలు చేస్తున్నారని…అలాంటి పిచ్చిపనులు మానుకోవాలని…లేదంటే ఆ బురదలో మీరే చిక్కకుంటారని హెచ్చరించారు.

మృతుడి భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణలల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల‌న్నారు. మృతుడి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే సబ్ స్టేషన్ కోసం స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు. ఇది ముమ్మాటికి విపక్షాల రాజకీయ ప్రేరేపిత హత్యేనని విమర్శించారు. స్వలాభo కోసం అమాయకులను బలి పశువులు చేయొద్దని ప్రతి పక్షాలకు మంత్రి హితవు పలికారు.