ఎవడో ఏదో అనుకుంటే నేను రాజకీయం చేయలేను

ఎవడో ఏదో అనుకుంటే నేను రాజకీయం చేయలేను

పార్టీ అధ్యక్షుడిని కలిస్తే తప్పు కానీ.. సీఎంని కలిస్తే తప్పేంటన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజనకు ముందు కూడా అన్ని పార్టీల సభ్యులు ముఖ్యమంత్రిని కలిసే వాళ్ళన్నారు. సీఎంని కలవగానే పార్టీ మారినట్టా..? అన్నారు. ముఖ్యమంత్రిని కలిసే విషయం పార్టీలో చెప్పి చేసిందేనన్న ఆయన.. పీజేఆర్ కంటే తిస్మర్కన్ లేరు కదా అన్నారు. పీజేఆర్ కూడా సీఎంని కలిసేవారని గుర్తు చేశారు. బురద జల్లే సంస్కృతి ఈ మధ్యనే స్టార్ట్ అయ్యిందన్న జగ్గారెడ్డి.. నేను కూడా సీఎంని కలవాలని అప్పాయింట్ మెంట్ అడుగుతున్న అన్నారు. ఎవడో ఏదో అనుకుంటే నేను రాజకీయం చేయలేననని..  ఒక వ్యక్తి పార్టీనీ కబ్జా చేస్ అవకాశం లేదన్నారు. కానీ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ లోకి  కొత్తగా వచ్చిన వాళ్ళు చేసేది ఎం లేదని.. సోనియా, రాహుల్ గాంధీలే బలం అన్నారు. ప్రతిపక్ష పార్టీలు సీఎంనీ కలవ కూడదు అనేది తప్పు అని..  భట్టి విషయంలో సిఎల్పీ నేత మీద కూడా బురద జల్లితే ఇంకేం ఉందన్నారు. భట్టి ఆవేదన అర్దం చేసుకోవచ్చు అన్నారు.