చైనా వ్యాక్సిన్‌ తయారు చేస్తే .. ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం: ట్రంప్‌

చైనా వ్యాక్సిన్‌ తయారు చేస్తే .. ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం: ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రపంచంలోని ఏ దేశంతో అయినా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒక వేళ చైనా వ్యాక్సిన్‌ తయారు చేస్తే దాంతో కలిసి పనిచేస్తామని ట్రంప్‌ చెప్పారు. “ మాకు మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా వారితో కలిసి పనిచేస్తాం” అని ట్రంప్‌ అన్నారు. చైనాతో కలిసి పనిచేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని అన్నారు. పొటన్షియల్‌ వ్యాక్సిన్‌ రిజల్ట్‌ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని యూఎస్‌ మిలటరీ దాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేస్తారని ఆయన అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని ట్రంప్‌ మొదటి నుంచి విమర్శలు చేశారు.

కరోనా వైరస్‌ సంక్షోభం కారణంగా ప్రతి ఒకరు మాస్క్‌ పెట్టుకోవాలని ట్రంప్‌ మరోసారి అన్నారు. సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేందుకు వీలులేనప్పుడు కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాలని ఆయన అన్నారు. గతంలో మాస్క్‌ పెట్టుకునేందుకు వ్యతిరేకత వ్యక్తం చేసిన ట్రంప్‌ ఈ మధ్యే మాస్క్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు మాస్క్‌పెట్టుకున్న ఫొటోలను కూడా ఆయన ట్వీట్‌ చేశారు.