Virat Kohli: ఐపీఎల్ 2026 ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై-టెన్షన్ మ్యాచ్‌లో ఆర్‌సీబీని బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్‌గా నిలిపిన విరాట్ కోహ్లీ.. అదే మ్యాచ్‌లో హ్యామ్‌స్ట్రింగ్ (తొడ కండరాల) గాయానికి గురయ్యాడు. ఈ ఇంజూరీ కారణంగానే అతను ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కోహ్లీ ప్లేస్‌లోకి యశస్వి జైస్వాల్‌ను రీప్లేస్‌మెంట్‌గా తెచ్చినప్పటికీ, వచ్చే నెలలో జరగబోయే ఇంగ్లాండ్ పర్యటన నాటికి కింగ్ కోహ్లీ కోలుకుంటాడా లేదా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
బెంగళూరు CoE కి కోహ్లీ:
విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన రిహాబిలిటేషన్ (కోలుకునే ప్రక్రియ) ప్రారంభించాడు.. అతని గాయం చాలా వేగంగా నయమవుతోంది. కానీ, అతను నేరుగా జట్టులోకి వచ్చే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్షలెన్స్ (CoE) కి రిపోర్ట్ చేసి, అక్కడ బోర్డు మెడికల్ టీమ్ నిర్వహించే ఫిట్‌నెస్ అసెస్‌మెంట్‌లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తేనే వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని సెలక్ట్ చేస్తారు. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లోని టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే ముందే.. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కి కోహ్లీ అందుబాటులో ఉండేదానిపై బీసీసీఐ ఒక క్లారిటీకి రానుంది.
ALSO READ : నెయ్‌మార్ ఆడతాడా లేదా?
ఐపీఎల్ 2026లో కింగ్ విధ్వంసం:
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 19వ సీజన్‌లో భీభత్సమైన ఫామ్‌తో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ నెగ్గిన మూడో జట్టుగా ఆర్‌సీబీ రికార్డు సృష్టించడంలో కోహ్లీదే మెయిన్ రోల్. కాగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా 4 సీజన్లలో 600+ రన్స్ కొట్టిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే ఈ 2026 సీజన్ లో 5 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీతో 56.25 సగటు, 165.84 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 675 పరుగులు సాధించి ఆర్‌సీబీకి రెండో ఐపీఎల్ కప్ అందించాడు.
