డ్రింక్స్ .. కివీస్ 33 ఓవర్లకు 122/2.. కేన్ హాఫ్ సెంచరీ

డ్రింక్స్ .. కివీస్ 33 ఓవర్లకు 122/2.. కేన్ హాఫ్ సెంచరీ

టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ సెమీస్ లో న్యూజీలాండ్ పూర్తి రక్షణాత్మకంగా ఆడుతోంది. డ్రింక్స్ సమయానికి 33 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసింది. 3.69 రన్ రేట్ తో పరుగులు సాధించింది న్యూజీలాండ్. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో.. పరుగుల రాక కష్టమైంది.

విలియంసన్ హాఫ్ సెంచరీ

కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ మరోసారి భారీ ఇన్నింగ్స్ పై నజర్ వేశాడు. చాహల్ బౌలింగ్ లో తీసిన సింగిల్ తో 79 బాల్స్ లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. వరల్డ్ కప్ 2019 టోర్నమెంట్ లో కేన్ 50 పరుగులు దాటడం ఇది నాలుగోసారి. గత 3 మ్యాచ్ లలో 50లను విలియంసన్ సెంచరీలుగా మలిచాడు. రాస్ టేలర్(22) విలియంసన్ కు తోడుగా క్రీజులో కొనసాగుతున్నాడు.