
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పనికి ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో ఓ వైన్ షాప్ సూపర్ వైజర్.. షాపులో పని చేసే కార్మికుడిని తీవ్రంగా కొట్టి అతని మృతికి కారణమయ్యాడు. సరూర్ నగర్ లో స్థానికంగా ఉన్న MRR వైన్స్ లో పని చేస్తున్న 40 ఏళ్ళ రాము సింగ్ అనే వ్యక్తిని.. సమయానికి రాలేదని.. వైన్స్ సూపర్ వైజర్ వెంకటేష్ తీవ్రంగా కొట్టాడు. అతని చేతిలో తీవ్ర గాయాలపాలైన రాము సింగ్.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు. రాము సింగ్ మృతికి కారణమైనందుకు వెంకటేష్ పై అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి.. వెంకటేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వెంకటేష్ పై 416/2019 ,యూ /సె 302 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీదర్ రావు తెలిపారు.