
మందుబాబులకు హైఅలర్ట్.. ఈ ఆది, సోమవారాల్లో మీరు వైన్స్‌కి వెళ్తే మందు దొరక్కపోవచ్చు. ఆషాఢమాసం ఆఖరి వారం లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా జులై 16,17న వైన్స్ బంద్చేయనున్నారు. వేలాది మంది భక్తులు లాల్ దర్వాజలోని ‘సింహవాహిని మహంకాళి’ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆదివారంతో బోనాల పండుగ పరిసమాప్తం కానుంది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్, ఎల్బీనగర్ జోన్ (వనస్థలిపురం డివిజన్), మహేశ్వరం జోన్ పరిధిలో రెండు రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఆదేశించారు.
ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ అదే సమయం వరకు వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
వచ్చే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలో(ఒక రోజు), సౌత్‌జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.